News

Pulasa Fish పులస చేప కి ఎందుకు అంత డిమాండో తెలుసా?

పులస చేపల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షాకాలం మొదలయ్యింది అంటే పులస చేపలు వచ్చినట్టే. ఎందుకంటే వాటి టేస్ట్ అంతలా ఉంటుంది. మామూలు చేపలలో కన్నా ఎక్కువ టెస్ట్ ఒక్క పులుస చేపలలో మాత్రమే ఉంటుంది. ఈ చేపలు ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలోని అంతర్వేది, భైరవపాలెం, నర్సాపురం లలో ఎక్కువగా దొరుకుతాయి. అంతేకాక ఈ పులుస చేపలు ఒడిస్సా, బంగ్లాదేశ్ తీరాల్లో కూడా దొరుకుతాయి.

అయినప్పటికీ ఈ గోదావరి పులుసు చేపల రుచి వాటికి ఉండదు. అందువల్ల గోదావరి పులుసచేపలు ఎంత రేటు ఎక్కువ ఉన్నా వాటిని కచ్చితంగా తీసుకుంటారు. ఈ పులుసు చేపల రేట్లు దాదాపుగా 30 వేల వరకు సాగుతుంది. ఈ పులస చేపలు సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే దొరుకుతాయి.

PULASA పులస ఏ మాసంలో దొరుకుతుంది

ఆషాడ మాసం, శ్రావణమాసంలో మాత్రమే పులస చేపలు దొరుకుతున్నందువల్ల వీటికి అంత డిమాండ్ ఉంటుంది. వీటిని సామాన్య ప్రజలు వీటికున్న డిమాండ్ రేట్ల వల్ల కొనలేకపోతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో సంచరించే ఇలాస అనే చేపలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఖండాలను దాటుకొని హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలో కలిసి గోదావరిలోకి చేరుతాయి. వానాకాలంలో గోదావరి నీరు అంతర్వేది వద్ద కలిసే సమయంలో గుడ్లు పెడతాయి.

pulasa fish special

Pulasa Special

సముద్రంలోని ఉప్పు నీటితో ఉండే ఈ చేపలు గోదావరికి ఎర్ర నీరు రాగానే ఎదురీది వశిష్ట, వైనతేయా అనే నదుల గుండా ప్రయాణించి వరద నీటి నురగను తిని బ్రతుకుతాయి. నీటికి ఎదురీదడం వల్ల ఇలస చేపలకు పట్టిన ఉప్పులవణాలు తొలగిపోయి కేవలం గోదావరిలోకి వచ్చిన ఎర్ర నీటిలో రెండు మూడు రోజుల్లోనే పులసగా మారి ఎక్కడా లేనంత రుచిని అందిస్తాయి.

ఈ పులస చేపల శాస్త్రీయ నామం” హిల్సా హిల్సా” పులస చేపలు ఆషాడ శ్రావణ మాసంలో గుడ్డు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఈ చేపలు జాలర్లకు అంత తేలికగా దొరకవు, వీటిని పట్టుకోవడం కోసం వారు చాలా కష్టపడాల్సిందే, ఎందుకంటే ఏటి మధ్యలో ఉంటాయి. అందువల్ల ప్రత్యేకమైన వలల ద్వారా వీటిని పట్టుకుంటారు. అయినప్పటికీ పులస చేపలు ఎక్కువగా దొరుకుతాయని నమ్మకం లేదు.

ఒక్క పులుసు చేప దొరికిన పండగ చేసుకోవచ్చని జాలర్లు అంటారు. మిగిలిన మామూలు చేపలలో కంటే ఈ చేపలలో రక్త ప్రసరణ ఎక్కువ వేగంతో ఉంటుంది. అందువల్ల వలలో పడిన వెంటనే చనిపోతాయి. అయినప్పటికీ రెండు రోజులైనా చెడిపోకుండా ఉంటాయి. వీటికున్న రేట్ల వల్ల కొందరు మోసం చేస్తుంటారు. ఇలస చేపలను పులుసులు అని చెప్పి ఎక్కువ రేటుకు అమ్ముతారు. అందువల్ల కొన్ని తేడాల ద్వారా వీటిని కనుక్కోవచ్చు.

ఇదే నిజ పులస చేపల గురించి తెలుసుకునే పద్ధతులు.

  • 1. ఇలస చేపలు తెలుపు రంగులో ఉంటాయి.
  • 2. పులస చేపలు కొంచెం తెలుపు కొంచెం గోధుమ రంగులో ఉంటాయి.
  • 3. వీటి శరీరంపై తోక నుంచి చేప మధ్య భాగం వరకు ఎర్ర రంగు చార ఉంటుంది.
  • 4. పులస చేపలు కోసినప్పుడు మధ్యలో చక్రకారంగా ఉంటుంది. మిగిలిన ఏ చేపలకు ఈ వలయాకార గుర్తులు ఉండవు.
  • 5.గ్యాస్ స్టవ్ ల మీద పులస చేపలు వండితే అంత రుచి ఉండదు. కేవలం కట్టెల పొయ్యి మీద మాత్రమే వండాలి.
  • 6. వీటి వంటకానికి ఎక్కువగా చింత కట్టెలు మాత్రమే వాడతారు.
  • 7. ఈ పులస చేపలు మామూలు చేపల లాగా కాక మూడు లేదా నాలుగు గంటల వరకు ఉడకవు.
  • 8.వీటిలో ముళ్ళు కూడా ఉండవు . 

పులస చేప కి ఎందుకు అంత ధర

ప్రస్తుతం తాజాగా కాకినాడ జిల్లాలోని యానం మార్కెట్లో పులస చేప రికార్డు స్థాయిలో ధర పలికింది. అక్కడ చేపల మార్కెట్లో జరిగిన వేలం పాటలో పులస చేప ఈ సీజన్ మొత్తానికంటే ఎక్కువ ధరణి పలికింది. రెండు కేజీల బరువు ఉన్న పులస చేపను పార్వతీ అనే మహిళ పట్టుకుంది.

దాన్ని వేలం పాటలో భైరవపాలెం కు చెందిన ఒక వ్యక్తి 19వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఈ సంవత్సరంలో ఇదే ఎక్కువ ధర అని అక్కడి జాలర్లు చెబుతున్నారు. పోయిన సంవత్సరం 25000 పలికి పలికిందని, ఐ. పోలవరం మండలంలో భైరవపాలెం మొగ దగ్గర ఇసుకమేటలు ఎక్కువగా ఉండడం వల్ల సముద్రంలో నుంచి గౌతమీపాయలోకి పులసలు తక్కువగా వస్తున్నాయని మత్యకారులు చెప్పుకొచ్చారు. ఏదేమైనా కనీసం జీవితంలో ఒక్కసారి అయినా పులస చేపలు తినాలని అక్కడి ప్రజలు అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button