Education

TS Inter 2nd Year Results Declared

Telangana State Intermediate 2nd year Examination resuls declared. Students download results at tsbie.cgg.gov.in and tsbie.cgg.gov.in websites.

తెలంగాణ‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను సోమ‌వారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,28,754 మంది బాలికలు ఉండ‌గా.. 2,22,831 మంది బాలురు ఉన్నారు. 1,76,719 మంది ఏ గ్రేడ్‌, 1,04,886 మంది బి గ్రేడ్, 61887 సి గ్రేడ్, 1,08,093 మంది విద్యార్థులు డీ గ్రేడ్ సాధించిన‌ట్లు తెలిపారు. ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థి పాస్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో సాధించిన మార్కులు ఆధారంగా ఫలితాలు కేటాయింపు జ‌రిగింది. ప్రాక్టికల్స్ పరీక్షలకుగాను 100% మార్కులను వేశారు. గతంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాలేకపోయిన వారు, ప్రైవేట్ గా పరీక్షలు రాసేందుకు ఫీజులు చెల్లించిన వారికి 35% పాస్ మార్కుల కేటాయించారు. ఫలితాలను tsbie.cgg.gov.in, examresults.ts.nic.in వెబ్‌సైట్లలో తెలుసుకోవ‌చ్చు. tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫ‌లితాలు ల‌భిస్తాయి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button